నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘోరకృతాంతవీరభట కోటికి గుండెదిగుల్, దరిద్ర తా
కారపిశాచ సంహరణ కార్యవినోది, నికుంఠ మందిర
ద్వారక నాటభేది నిజదాసజనావళి కెల్ల ప్రొద్దు నీ
తారక నామమెన్ను కొన దాశరథీ కరుణాపయోనిధీ

భావం: ఓ దశరథరామా! సంసార భారం నుండి తరింప చేసే నీపేరు, భయంకరమైన యముని దూతలకు గుండెలు ఆదరజేస్తుంది. దయ్యంలాగ మనుష్యులను బాధించే దారిద్య్రం అనేదాన్ని పోగొట్టి ఆనందిస్తుంది. ఎల్లప్పుడు నీ దాసులు భక్తులు పరమపదానికి పోతున్నప్పుడు కలిగే ఆటంకాలను తొలగిస్తుంది. అంటే మోక్షాన్ని సంపాదించి పెడుతుంది.

దాశరథీ శతకములోని పద్యము