మంచి మాట

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుక్షిన జాండ పంక్తులొనగూర్చి చరాచర జంతుకోటి సం
రక్షణ చేయు తండ్రివి, పరంపర నీ తనయుండనైన నా
పక్షము నీవుగావలదె? పాపము లెన్ని యొనర్చినన్ జగ
ద్రక్షక కర్తనీవె కద దాశరథీ కరుణాపయోనిధీ
భావం: కుక్షిలోపల అంటే గర్భంలోపల బ్రహ్మాండ సమూహాలను పొందికగా పెట్టుకొని, చేతనములు, అచేతములు అయిన సకల ప్రాణి సమూహాలను రక్షించు తండ్రివి నీవే కాబట్టి తరతరములుగా నీ కుమారుడనై ఉన్న నా పాలిట నీవు పక్షపాతివై ఉండవలె. నేను పాపాలను చేసినానని నన్ను విడువరాదు. ఎన్ని పాపాలు చేసినా లోకమెల్లను రక్షించేవాడవు నీవే కాబట్టి ఆ పని చేసే వాడవు నీవొక్కడివే కాబట్టి నీవే నన్ను కాపాడవలెను.

దాశరథీ శతకములోని పద్యము