నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సురలు నుతింపగా త్రిపుర సుందరులన్ వరియింప బుద్ధ రూ
పరయగ దాల్చితీవు త్రిపురాసుర కోటి హరించునపుడా
హరునకు దోడుగా వరశరాసన బాణముఖోగ్ర సాధనో
త్కరమొనరించి తీవె కద, దాశరథీ కరుణాపయోనిధీ

భావము:దేవతలు ప్రార్థింపగా త్రిపురములందరి వనితలు వరించుకొరకు బుద్ధ స్వరూపమును దాల్చినవాడవు నీవే. రాక్షస సమూహములను కాల్చునపుడు శివునికి విల్లు అమ్ములు, మొదలైన సాధనములను సవరించి సాహాయ్యము చేసినవాడవు నీవే. ఇట్లు దుష్టులను నిగ్రహించి శిష్టులను రక్షించు నీవు నన్నును రక్షింపుమా.

దాశరథీ శతకములోని పద్యము