నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముదమున కాటపట్టు భవమోహ మదద్విరదాంకుశంబు సం
పదల కొటారు, కోరికల పంట, పరంబునకాది, వైరుల
న్నదన జయించు త్రోవ, విపదబ్ధికి నావ గదా సదా భవ
త్సదమల నామ సంస్మరణ దాశరథీ కరుణా పయోనిధీ

భావము: దశరథరామా! నిర్మలమైన నీ నామాన్ని స్మరించడం సంతోషాన్ని కలిగిస్తుంది. అంకుశము అనే సాధనము ఏనుగును అణచినట్లుగా జన్మంలో కలిగే వ్యామోహాన్ని అణచివేస్తుంది. అన్ని సంపదలను సమకూరుస్తుంది. పగవారిని గెలవడానికి సాధనము, సముద్రాన్ని దాటించు ఓడవలె కష్టాలను దాటిస్తుంది.

దాశరథీ శతకములోని పద్యము