నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దురితలతా నుసారి భవ దుఃఖ కదంబము రామ నామ భీ
కరతర హేతిచే దెగి వక్తావకలై చనకుండ నేర్చునే
దరికొని మండుచుండు శిఖి దార్కొనినన్ శలభాది కీటకో
త్కరము విలీనమై చనదె, దాశరథీ కరుణాపయోనిధీ

భావము: దశరథరామా! పాపము తీగలవలె - అనుసరించి రాగా దానితో కూడా సాగు దుఃఖాత్మకమైన జన్మ పరంపర వాడియైన ఖడ్గము చేత తీగ ముక్కలైనట్లు రామనామము చేత నశించి పటాపంచలవుతుంది. అంటుకుని మండుచున్న అగ్నికి దగ్గరగా వచ్చిన మిడుతలు మొదలైన పురుగుల సమూహము ఆ అగ్నిలో పడి నశించదా! నశించునని భావము.

దాశరథీ శతకములోని పద్యము