నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవి బింబం బుపమింప బాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్

భావము:వామనుడు బ్రహ్మాండమంతా నిండిపోతున్న ఆ సమయంలో సూర్యబింబం క్రమక్రమంగా అతనికి గొడుగుగా, తర్వాత శిరోమణిగా, తరువాత మకర కుండలంగా తరువాత కంఠాభరణంగా, ఆ తరువాత బంగారు భుజకీర్తిగా, అటు తరువాత కాంతులీనే కంకణంగా, అనంతరం మొలలోని గంటగా, ఆపైన మేలైన కాలి అందెగా, చివరకు పాదపీఠంగా ప్రకాశించింది.

మహా భాగవతం లోని పద్యము