నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలుక నొక రమణి ముద్దుల
చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరం
బిలిచిన మోక్షము నిచ్చితి
వలరగ మిము దలచు జనులకరుదా కృష్ణా!

భావం: ఒక సౌభాగ్యవతి చిలుక తెచ్చి ఎంతో ప్రియముగా పండ్లు పెడుతూ శ్రీరామా అని పిలవడం నేర్పించింది. దానితో ఆ చిలుక తీయని పండ్లు తింటూ శ్రీరామా అని సంబోధించేది. అలా నేర్చుకుని పిలిచినది ఆ చిలుకకు మోక్షమిచ్చిన భగవంతునివి నీవు. అట్లాంటి నీవు నీ విభవమును గూర్చి కీర్తించే మమ్ము కాపాడడంలో ఆశ్చర్యమేమున్నది.
*

శ్రీకృష్ణ శతకములోని పద్యము