నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పృథ్వీవృత్తము :
అమిత్త్రమదభేది యొక్కరుఁడ గానే్వషణ
భ్రమాకులితచిత్తుఁడై తగిలి పాఱుచునణ ముందటన్
శమీకుఁడనువాని నొక్కముని సత్తమున్ సంతత
క్షమాదమసమన్వితుం గనియెఁ గాన నాంతంబునన్
భావం: శత్రువుల గర్వాన్ని అణచే పరీక్షిత్తు అను మహారాజు వేటాడటం అనే ఆనందంతో అడవిలో వేటాడుతూ మిక్కిలి అలసిపోయాడు. అయనా ఇంకా తన బాణపు దెబ్బతిని కూడా పరుగెత్తే మృగాన్ని పట్టుకోవాలన్న ఆసక్తితో దానివెనుకనే తాను కూడాపరుగెత్తాడు. ఎలాగైనా ఆ మృగాన్ని పట్టుకోవాలన్న ఆశతో మృగాన్ని వెదకటం కొరకు ఎక్కవగా తిరగడం చేత కలతపెట్టబడిన హృదయం కలవాడై వెంటనంటి పరుగెత్తుతూ ఎదుట అడవి చివర అధికమైన ఓర్పుతోను అంతరింద్రియ నిగ్రహంతోను కూడిన శమీకుడనే పేరుగల ఒక ముని శ్రేష్ఠుడిని చూచాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము