నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శక్రసుత గాచు కొఱకై
చక్రము చేపట్టి భీష్ముఁ జంపగ జను నీ
విక్రమ మేమని పొగడుదు?
నక్రాగ్రహ ! సర్వలోకనాయక! కృష్ణా!
భావం; భారతయుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు తాను ఆయుధం పట్టనని కేవలం రథసారథిగా ఉంటానని అన్నాడు. కాని భీష్ముడు ఆ కృష్ణుని చేతనే ఆయుధం పట్టిస్తానని చెప్పి యుద్ధంలో అమితంగా ఓర్చుకోలేని విధంగా అర్జునుని బాధిస్తాడు. తన భక్తుడు, బంధువు అయిన అర్జునుణ్ణి రక్షించడానికి శ్రీకృష్ణుడు బండిచక్రం పట్టుకొని భీష్మునిపైకి వెళ్తాడు. ఆయుధం పట్టనన్న కృష్ణుడు భక్త రక్షణకోసం ఆయుధం పట్టాడు కదా. ఆయన్ను ఏమని పొగడాలి?
*
శ్రీ కృష్ణ శతకములోని పద్యము
*
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003