నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిక్కెవ్వరు ప్రహ్లాదుకు
దిక్కెవ్వరు పాండుసుతుల దీనుల కెపుడున్
దిక్కెవ్వ రయ్య హల్యకు
దిక్కెవ్వరు? నీవు నాకు దిక్కుకు కృష్ణా!

భావం : ముల్లోకాలను పీడించేవానిగా పేరెన్నికన్న హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. పుట్టుకనుంచి హరిభక్తుడు. నిరంతరం హరినామానే్న జపించేవాడు. తన తండ్రి చేత హింసకు గురియైనాడు. అటువంటివానికి నీవే కదా దిక్కు. పాండుసుతులు మహారాజు బిడ్డలైనప్పటికీ కడగండ్ల పాలయ్యారు. వారినీ రక్షించిందీ నీవే కదా. అహల్య తన భర్త శాపానికి గురియై రూపంలేనిదై పడి ఉండింది. కాని ఆ తల్లిని రక్షించి ఆమె శాపాన్ని పోగొట్టింది నీవే కదా. ఇంతమందిని రక్షించిన నీవు నాకు దిక్కుకాక మరెవ్వరు అవుతారు? నాకు నీవు తప్ప మరెవ్వరును దిక్కు కాజాలరు.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము