నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురుషోత్తమ ! లక్ష్మీపతి!
సరసిజగర్బాది వౌని సన్నుత చరితా!
మురభంజన! సురరంజన!
వరదుడవగు నాకు భక్తవత్సల !కృష్ణా!

భావం: పురుషోత్తముడనగా పురుషులకంటె ఉత్తముడని అర్థం. శ్రీకృష్ణ భగవానుడు గీతలో తన పేరు పురుషోత్తముడని స్వయంగా చెప్పుకొన్నాడు. లోకంలో క్షరుడనీ, అక్షరుడనీ ఇద్దరు పురుషులున్నారు. క్షరుడనగా బద్ధాత్మ. అక్షరుడనగా ముక్తాత్మ . అక్షరుడు సంకోచాలు లేకుండా సర్వదా జ్ఞానాకారుడై ప్రకాశించేవాడని అర్థం.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము