నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కృష్ణ శతకములోని పద్యము
*
పరుసము సోకిన యినుమును
వరుసగ బంగారమైన పడువున జిహ్వన్
హరి ! నీ నామము సోకిన
సురవందిత! నేను నటుల సులభుడ కృష్ణా!
భావం:4 స్పర్శవేధి ఇనుమునకు సోకితే ఇనుము బంగారమైనట్లుగా ఓ శ్రీహరి నీ శుభనామము నా నాలుకను తాకగానే నేను కూడా సుళువుగా మోక్షార్హుడనవుదును. పరుసముసోకి లోహంబు పసిడియైన పగిది అని రుక్మాంగద చరిత్రము చెప్పినట్లుగా మంగళములకు మంగళము నిఖిల వేదవల్లికి నిత్యఫలము చిన్మయ స్వరూపము శ్రీకృష్ణనామము శ్రద్ధతో గాని హేలగా గాని ఒకసారి నామసంకీర్తన చేసిన మాత్రం చేతనే అది నరులను ఉద్ధరిస్తుంది. కనుక శ్రీకృష్ణనామము పరుసవేది.