నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. నీవును బ్రహ్మచారివి వినీతుఁడ గన్యకన్ మహీ
దేవకులావతంస రవితేజ ! వివాహము నీకు నాకు మున్
భావ జశక్తి వైనయది పన్నుగ నన్ను ఁ బరిగ్రహింపు సం
జీవని తోడ శుక్రుదయం జేయుము నాకుఁబ్రియంబు నావుడున్
భావం: బ్రాహ్మణ కులానికి అలంకార మైన వాడా ! సూర్యుడీకాంతివంటి కాంతి కలిగిన ఓ కచుడా! నీవు వినయవంతుడివి. అవివాహితుడవు. నేను కూడా కన్యను. నీ కూ , నాకుకూ ఇంతకుముందే మన్మథుడి శక్తి చేత పెళ్లి అయిపోయింది. అందుచేత శుక్రుడి చేదయతో సంజీవనీ విద్యతో పాటుగా నన్ను స్వీకరించి వివాహమాడి నాకు ప్రీతి కలిగించుము ’ మృత సంజీవని విద్యను నేర్చుకొన్న తరువాత కూడా చాలా కాలం శుక్రుని వద్ద శుశ్రూష చేసి తిరిగి తన తండ్రి దగ్గరకు వెళ్లాలనుకొంటున్న కచుడు తన గురువు దగ్గర అనుమతి తీసుకొని గురుపుత్రి యైన దేవయానికి కూడా విషయం తెలుపగా ఆమె పై విధంగా మాట్లాడింది.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము