నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. గౌతమీ స్నానానఁ గడతేరుదా మంటె
మొనసి చన్నీళ్లలో మునుఁగలేను
తీర్థయాత్రలచేఁ గృతార్థుఁడౌదామంటే
బడలి నే మంబు నే నడవలేను
దాన ధర్మముల సద్గతిని జెందుదమంటె
ఘనముగా నావద్ద ధనము లేదు.
తపమాచరించి సార్థకత నొందుద మంటె
నిమిషమైన మనసు నిలువ లేదు
తే. కష్టముల కోర్వనా చేతఁగాడు నిన్ను
స్మరణ చేసెద నాయథా శక్తి కొలది
భూషణ వికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: స్వామీ! గోదావరిలో స్నానం చేసి తరిద్దాం లెమ్మనుకొంటే ఆ చన్నీటీలో నేను మునగలేను. పుణ్యతీర్థాలు తిరిగి ప్రయోజకుణ్ణవుదామనుకుంటే నియమ నిష్ఠల్ని పాటించలేదు. దానధర్మాలు చేద్దాం లెమ్మనుకొంటే నావద్ద డబ్బులు లేవు. తపస్సు చేద్దామనుకొంటే క్షణకాలం కూడా మనస్సు కుదుటగా ఉండటంలేదు. నేను కష్టాల్ని సహించలేను. నా శక్తికొద్ది నిన్ను ధ్యానిస్తాను.కర్మేంద్రియాలు సహకరించకపోతే కర్మనిర్వహణ కష్టం అవుతుంది. మనసునిలవకపోతే తపస్సు చేయడం కష్టం. ఎంత కష్టమైనా భగవంతుని నామాన్ని పదేపదే స్మరిస్తూ ఉంటే ఒకనాటికి ఏకాగ్రత కుదురుతుంది. కనుక నామోచ్చారణను మాత్రం ఎప్పటికీ విడనాడకూడదు.

శ్రీ నరసింహ శతకములోని పద్యము