నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. కచుఁడత్యంతవిషా
దాకులుఁడై ‘లోకనింద్యమగు నర్థము నీ
వాకునకుఁదెచ్చుటుచితమె?
నాకు సహోదరివి నీవు నా చిత్తమునన్’

భావం: దేవయాని తనను వివాహమాడుమని కోరగా కచుడు శోకం చేత కలత పొందినవాడై ‘లోకం చేత నిందించదగిన కోరిక నీ వాక్కునకుతెచ్చుట తగునా? (పలకటం తగదు) గురుపుత్రివి అవటం చేత నా హృదయం నీవు సోదరివి. నేను నిన్ను చెల్లెలుగా భావిస్తున్నాను. సంజీవని విద్య నేర్చుకొని మృతి నొందిన కచుడు తిరిగి బతికిరాగా దేవయాని మిక్కిలిగా సంతోషించింది. ఆపైన తిరిగి కచుడు తన విద్యాభ్యాసము, గురుసేవ ముగించుకొని తన దేవలోకమునకు వెళ్లడానికి అనుమతిని తీసుకొంటున్న సమయంలో దేవయాని తన మనసులోని మాటలను కచునితో చెప్పింది. తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దని అందరూ నిందించదగ్గ పనులు చేయకూడదనే విషయాన్ని చెప్పిన కచుడు దేవయానికి హితబోధ చేశాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము