నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. పసరంబు బందైనఁ బసుల కాపరితప్పు
ప్రజలు దుర్జనులైన ప్రభునితప్పు
భార్య గయ్యాళైనఁ బ్రాణనాథుని తప్పు
తనయుఁడు దుష్టైన ఁ దండ్రి తప్పు
సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు
కూతురు చెడుగైన మాతతప్పు
అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు
ఇభమది చెడ మావటీని తప్పు
తే, ఇట్టితప్పు లెఱుంగక యిచ్చ వచ్చి
నటుల మెలగుపు రిప్పుడీ యవని జనులు
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం; ఓ నరసింహస్వామీ! గొడ్డుచెడితే పసుల కాపరి తప్పు. ప్రజలు చెడితే రాజుగారిది తప్పు. ఇల్లాలు చెడితే మగనిది తప్పు. కొడుకు చెడితే తండ్రిది తప్పు. సేన చెల్లాచెదరైతే సేనానాయకునిది తప్పు. కూతురు కాలు జారితే తల్లిది తప్పు.గుఱ్ఱం చెతిదే రౌతుది తప్పు. ఏన్గు చెడితే మావటి వానిది తప్పు. ఈ తప్పులు తెలీక లోకులీనాడు తమ ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు. పెద్దలు ఏ దారిన నడుస్తే పిన్నలు అదే దారిని ఎన్నుకొంటారు. ఈ విషయం తెలియని పెద్దలైతే పిన్నలను చెడుదారిలో ఉన్నారని అంటారు కాని వారేదారిలో ఉన్నారో వారికి తెలియదు. కనుక పెద్దలంతా మంచిదారిని ఎన్నుకొంటే ఏ శిక్షణ లేకుండానే పిల్లలంతా మంచిదారిలో నడుచుకుంటారు.

శ్రీ నరసింహ శతకములోని పద్యము