నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. తల్లిగర్భము నుండిధనము తేఁ డెవ్వఁడు
వెళ్లిపోయెడి నాడు వెంటరాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని
మెఱుఁగు బంగారంబు మ్రింగబోఁడు
విత్తమార్జన చేసి విఱ్ఱవీగుటె గాని
కూడఁబెట్టిన సొమ్ము కుడువఁబోడు
పొందుగా మఱుగైన భూమి లోపలఁబెట్టి
దానధర్మము లేక దాచి దాచి
తే. తుదకు దొంగలకిత్తురో దొరలకవునొ
తెనె జుంటీగలియ్యవా తెరువరులకు
భూషణ వికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం: పుట్టేటపుడు ధనమెవ్వరూ తీసుకొని రారు. చనిపోయే నాడు ఏది తన వెంటరాదు. ఎంత గొప్ప ధనికుడైనా ఉప్పన్నమే గాని మెరిసే బంగారాన్ని మ్రింగడు. డబ్బు గడించి పొగురబోతు తనాన్ని పెంచుకోవటమే కాని ఆ సొమ్ము అనుభవానికి రాదు. కూడబెట్టిన సొమ్ము దొంగల పాలౌతుందో లేక దొరల పాలౌతుందో తెలియదు. తేనెటీగలు తెట్టెల్లో తేనెని కూడబెట్టి బాటసారుల కిస్తున్నాయి గదా.

శ్రీ నరసింహ శతకములోని పద్యము