నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ నరసింహ శతకములోని పద్యము
*
సీ. లోకమందెవఁడైన లోభి మానవుఁడున్న
భిక్షమర్థికి ఁ జేతఁ బెట్టలేఁడు
తాను బెట్టకయున్న దగవు పుట్టదు గాని
యొరులు పెట్టఁగ జూచి యోర్వలేఁడు
దాత దగ్గఱ జేరి తనములెల్లచెడునట్లు
జిహ్వతోఁ జాడీలు చెప్పుచుండు
ఫలమువిఘ్నంబైన బలుసంతసంబంధి
మేలు గల్గిన ఁ జాల మిడుకుచుండు

తే. శ్రీరమానాథ! యిటువంటి క్రూరునకును
భిక్షుకుల శత్రువని పేరుపెట్టవచ్చు
భూషణ వికాస ! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం: ఓ నరసింహ ప్రభూ! ఈ లోకంలో పిసినారి యాచకుల కేమి ఇవ్వడు. తాను పెట్టకపోతే విచారించవలసిందేమీ లేదు కాని ఇతరులు దానం చేస్తే చూచి సహించలేడు. దాత పంచచేరి తనముల్లె జారిపోయినట్లు యాచకులపై చాడీలు చెబుతాడు. ఇచ్చేవారు దానఫలం ఇవ్వకుండ మానివేస్తే ఎంతో సంతోషిస్తాడు. వారికి మేలు జరిగితే మిక్కిలి బాధపడుతాడు. ఇటువంటి నేటికాలంలోను తారసిల్లుతుంటారు.
*
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003