నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ నరసింహ శతకములోని పద్యము
*
సీ. నీల మేఘ శ్యామ నీవె తండ్రివి మాకు
కమలవాసిని మమ్ము కన్నతల్లి
నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్
నీకటాక్షము మా కనేక ధనము
నీ కీర్తనల్ మాకు లోక ప్రపంచంబు
నీ సహాయము మాకు నిత్యసుఖము
నీ మంత్రమే మాకు నిష్కలంకపు విద్య
నీ పదధ్యానంబు నిత్య జపము
తే. తోయజాతాక్ష! నీ పాద తులసిదళము
భోగముల కౌషధము బ్రహ్మ రుద్ర వినుత!
భూషణ వికాస! శ్రీధర్మ పురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం: ఓ నరసింహస్వామి మాకు తండ్రివి నీవే. లక్ష్మీదేవి యే మా కన్నతల్లి. నీ భక్తులే మా బంధువులు. నీ దయయే మా సొమ్ము. నీ పాటలే మాలోకం, నీ నామజపమే మా విద్య నీ పాద ధ్యానమే నిత్య జపం నీ పాదాల మీద పూజ చేసిన తులసీదళం రోగాలన్నింటిని రూపుమాపే మందు బ్రహ్మ రుద్రులచే పొగడబడుతున్న ఓ స్వామీ నీ వే మాకు అన్నియూ అని శతకకారుడు చెబుతున్నాడు.
*
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003