నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు బావ
మఱఁదులన్నలు మేనమామగారు,
ఘనముగా బంధువుల్ గల్గినప్పటికైన
దాను దర్లగవెంటఁదగిలి రారు
యముని దూతలు ప్రాణమపహరించుకపోవ
మమతతో ఁబోరాడి మాన్పలేరు
బలగ మందఱు దుఃఖపడుట మాత్రమె కాని
యించుక నాయుష్య మియ్యలేరు
తే. చుట్టముల మీది భ్రమ దీసి చూరఁబెట్టి
సంతతము మిమ్ము నమ్ముట సార్థకంబు
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం :ఓ నరసింహస్వామీ!తల్లీ, తండ్రీ, ఇల్లాలు, పిల్లలూ మొదలైన ఆత్మీయులు బావమరదులు, అన్నదమ్ములూ, మేనమామలూ మొదలైన చుట్టాలు ఎందరున్నా చనిపోయేటప్పుడు వెంట వచ్చే వారెవ్వరూ లేరు. ప్రాణాల్ని హరించుకుని పోయే యమదూతల్ని అడ్డగించి నిలిపే వారొక్కరూ లేరు. ఈ చుట్టాలందరు ఏడ్చేవారే గాని ఆయుస్సు నిచ్చేవారు గారు. కాబట్టి ఈ బంధువులపై మమకారం విడిచి ముక్తిప్రదాతవైన నిన్ను నమ్ముకోవడమే మంచిది.

శ్రీ నరసింహ శతకములోని పద్యము