నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ నరసింహ శతకములోని పద్యము

సీ. ఇభరాజవరదు నినె్నంత పిల్చిన ఁగాని
మాఱుపల్కవదేమి వౌనితనము
మునిజనార్చిత నిన్ను మ్రొక్కి వేడిన ఁగాని
కనులఁ బడవదేమి గడుసుఁదనము?
చాలదైన్యము నొంది చాటు చొచ్చిన ఁగాని
భాగ్యమియ్య వదేమి ఫ్రౌడితనము
స్థిరము గా నీపాద సేవఁ జేసెదనన్న
దొరక ఁజాలవదేమి ధూర్తు తనము
తే. మోక్షదాయక ఇటువంటి మూర్ఖజనుని
కష్టపెట్టిన నీకేమి కడుపు నిండు
భూషణవికాస ! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురిత దూర!

భావం: గజేంద్రుని సంరక్షించిన ఓ స్వామి నోరార నిన్ను పిల్చినా మారు పల్కకున్నావు. ఏమా మూగతనము? మునిజనులచే కొనియాడబడు ఓ దేవా! నీకెన్ని దండాలు పెట్టినా కండ్లకగుపించవు. ఏమా గడుసుదనము ఎంతో దైన్యంతో నీ మరుగుజొచ్చినా భోగభాగ్యాలొసంగవు ఏమా గొప్పదనము తెగబడి నీ పాద సేవ చేస్తానన్నా దొరకవు. ఏమా దుర్మార్గం మోక్ష దాతవైన ఓ నరసింహ ప్రభూ! నా వంటి అమాయకని కష్టపడి తే నీకు కడుపు నిండుతుందా?