నేర్చుకుందాం

నరసింహ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. ఇలలోననే జన్మ మెత్తినప్పటి నుండి
పలుగడించితి నయ్య పాతకములు
తెలిసి చేసితిఁ గొన్ని తెలియఁజాలక చేసి
బాధ నొందితినయ్య పద్మనాభ!

అనుభవించెడు నప్పుడతి ప్రయాసంబంచు
బ్రజలు చెప్పఁగ జాల భయము గలిగె
ఎగిరి పోవుటకునై ఏ యుపాయంబైనఁ
జేసి చూతమటన్న ఁ జేతకాదు

తే. సూర్యశశినేత్ర! నీ చాటుఁ జొచ్చినాటఁ
గలుషములు ద్రుంచి ననే్నలు కష్టమనక
భూషణ వికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార!నరసింహ! దురిత దూర!

భావం: స్వామీ! పుట్టిన తర్వాత ఎన్నో పాపాలు చేశాను. కొన్ని తెలిసి చేసి, కొన్నింటిని తెలియక చేసి చాలా బాధ పడ్డాను. వీటి ఫలితాన్ని అనుభవించడం చాల ప్రయాసతో కూడిందని ప్రజలు చెప్పితే విని భయపడ్డాను. తప్పించుకుని పారిపోదామంటే నాకు చేత కాలేదు ప్రభూ! నీ ఆశ్రయం కోరాను. నన్ను దగ్గర తీసి కాపాడు కష్టమనుకోకు.
*
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003