నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం

సీ॥ అడవి పక్షులకెవ్వఁడా హారమిచ్చెను
మృగజాతికెవ్వఁడు మేత పెట్టె?
జల చరాదులకు భోజనమెవ్వఁడి ప్పించె?
చెట్ల కెవ్వఁడు నీరు చేది పోసె?
స్ర్తిల గర్భంబులన్ శిశులనెవ్వఁడు బెంచె?
ఫణుల కెవ్వఁడు పోసెఁ బరగవిషము
మధుపాళికెవ్వండు మకరందమొనరించె?
పశుల కెవ్వఁ డొసెంగెఁ బచ్చిపూరి?

తే॥ జీవకోట్లను బోషింపనీవెకాని
వెఱె యొక దాత లేఁడయ్య వెదకి చూడ!
భూషణవికాస! శ్రీ ధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ స్వామీ! అడవి పక్షులకాహారాన్ని, అడవి మృగాలకు మేతని, జలచరాలకు తిండి, చెట్లకు నీరు, గర్భస్థ శిశువులకు పోషణ, పాములకు విషం, తుమ్మెదలకు తేనె, పసులకు పచ్చిగడ్డి ఎవరు కూర్చినారు? ఈ సమస్త జీవరాశుల్ని పోషించగల దాతవు నీవు దప్ప వేరొకరెవ్వరు లేరు.