నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసింహ శతకం
*
సీ॥ ప్రహ్లాదుఁడే పాటి పైడి కానుకలిచ్చె?
మదగజంబెన్నిచ్చె వౌక్తికములు?
నారదుండెన్నిచ్చె నగలు రత్నంబుల?
హల్య నీకే యగ్రహారమిచ్చె?
ఉడుత నీకేపాటి యూడిగంబులు చేసె?
ఘన విభీషణుఁడేమి కట్నమిచ్చె?
పంచపాండవులేమి లంచమిచ్చిరి నీకు?
ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చె
తే॥ నీకు వీరందరయినట్లు నేను కాన?
ఎందుకని నన్ను రక్షింప విందువదన?
భూషణ వికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
*
భావం: ఓ స్వామీ! నీచే కాపాడబడ్డ ప్రహ్లాదుడు నీకెంత బంగారమిచ్చాడు? గజేంద్రుడు ఎన్ని ముత్యాలు పోసినాడు? నారదుడేమైనా నగలు, రత్నాలు ఇచ్చాడా? అహల్య నీకేమైన అగ్రహార దానం చేసిందా? ఉడుత నీకెంత సేవ చేసింది? ఆ విభీషణుడేమైనా కట్నమిచ్చాడా? పంచపాండవులు లంచమేమైనా ఇచ్చారా? ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చింది? వీరందరి లాంటి వాణ్ణి నేను కానా? ఏమి లేకుండానే వారెల్లరిని కాపాడావు. ననె్నందుకు రక్షించవు ప్రభూ!