నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క. అనుపమ నియమాన్వితులై
యనూనద దక్షిణలఁ గ్రతుసహంబులు సే
సిన వారికంటె నక్రో
ధనుఁడ గరంబధికుఁడండ్రు తత్త్వవిధిజ్ఞుల్
భావం: సాటిలేని నియమంతో కూడిన వారై గొప్ప దక్షిణలతో వేలకొద్దీ యజ్ఞాలు చేసిన వారికంటె కూడా కోపం లేనివాడే మిక్కిలి గొప్పవాడని పరమార్థం తెలిసిన వారు చెప్తారు. దేవయాని యయాతి మహారాజు వల్ల రక్షించబడింది. ఆతరువాత యయాతి తన నిజనగరికి వెళ్లగా దేవయాని ఎంతో ఆవేదనతో ఆలోచిస్తున్న సమయంలో ఘూర్ణిక అను చెలికత్తెను చూచి సంతోషించి తనను వెదుకుతూ వచ్చినదన్న విషయం తెలసుకుంది. ఆపై తానుఈ వృషపర్వుడు పాలిస్తున్న నగరిలోకి రానని, వృషపర్వుని కూతురైన శర్మిష్ఠ వల్ల కీడును పొందానని కన్నీళ్లతో చెప్పి తన తండ్రికి విషయం తెలుపమని ఘూర్ణిక పంపింది. ఆ ఘూర్ణిక వెళ్లి జరిగినసంగతిని దేవయాని చెప్పినవిధంగానే శుక్రాచార్యునికీ విషయం తెల్పింది. ఆ తరువాత శుక్రుడు ఎంతో ఆవేదనతో వచ్చి తన కుమార్తె నుచూచి విషయాన్ని గ్రహించి ఈవిధంగా స్పందించాడు.

శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము