నేర్చుకుందాం

నేర్చుకుందాం( నరసింహ శతకం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ భువనేశ! గోవింద! రవికోటి సంకాశ!
పక్షివాహన! భక్త పారిజాత!
ఆంభోజభవరుద్రజంభారిసన్నుత!
సామగానవిలోల! సారసాక్ష!
వనధిగంభీర! శ్రీవత్సకౌత్సుభవక్ష!
శంఖచక్ర గదాసిశార్‌ఙ్గహస్త!
దీనరక్షక! వాసుదేవ! దైత్యవినాశ!
నారదార్చిత! దివ్యనాగశయన!
తే॥ చారునవరత్నకుండల శ్రవణయుగళ!
విబుధవందితపాదాబ్జ విశ్వరూప!
భూషణ వికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
తా. ఓ స్వామీ! నీవు లోకపాలకుడవు. గోపాలకుడవు. కోటిసూర్యులతో సమానుడవు. గరుడవాహనుడవు. భక్తులపాలిటి పారిజాత వృక్షానివి. బ్రహ్మరుద్రేంద్రాదులచే ప్రస్తుతింపబడువాడవు. సామగాన ప్రియుడవు. పద్మలోచనుడవు. సముద్రము వలె గంభీరుడవు. శ్రీవత్సవక్షుడవు. కౌస్త్భువక్షుడవు. శంఖం, చక్రం, గద, కత్తి, ధనస్సు చేతుల ధరించినవాడవు. దీనరక్షకుడవు. వాసుదేవుడవు. రాక్షసాంతకుడవు. నారదునిచే కొనియాడ దగినవాడవు. పన్నగశయనుడవు. చెవుల నవరత్న కుండలాలు తాల్చినవాడవు. నీ పాద పద్మాలకు పండితులెప్పుడూ నమస్కారం చేస్తారు. నీవు దురితదూరుడవు. నీకిదే మా నమస్కారం.