నేర్చుకుందాం

నేర్చుకుందాం( నరసింహ శతకం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ నాగేంద్రశయన! నీ నామమాధుర్యంబు
మూడు కన్నుల సాంబమూర్తి కెరుక
పంకజాతాక్ష! నీ బలపరాక్రమ మెల్ల
భారతీపతియైన బ్రహ్మకెరుక
మధుకైటభారి! నీ మాయసమర్థత
వసుధలో బలిచక్రవర్తి కెరుక
పరమాత్మ! నీదగు పక్షపాతిత్వంబు
దశశతాక్షులపురందరున కెరుక

తే॥ వీరికెరుకగు నీ కథల్ వింతలెల్ల
నరుల కెరుకన్న నెవరైన నవ్విపోరె?
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: ఓ నాగరాజశయనా! నీ నామరుచి సాంబశివునికి తెలుసు. పద్మాక్షా! నీ బలపరాక్రమాలు వాణీధవుడగు బ్రహ్మకు తెలుసు. మధుకైటభరాక్షసుల చంపిన నీ మాయాశక్తి బలిచక్రవర్తికి తెలుసు. నీ పక్షపాత వైఖరి సహస్రాక్షుడైన ఇంద్రునికి తెలుసు. వీరికి తెలిసిన నీ కథలలోని మర్మాలు సామాన్య మానవులకు తెలుసును అని పలికితే ఎవ్వరైనా నవ్వరా తండ్రీ!