నేర్చుకుందాం

నేర్చుకుందాం-- దాశరథి శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ.కనకవిశాలచేల, భవకాననశాతకుఠారధార, స
జ్జనపరిపాలశీల, దివిజస్తుత సద్గుణకాండ, కాండసం
జనిత పరాక్రమక్రమ విశారద, శారదకందకుందచం
దనఘనసారసారయశ, దాశరథీ కరుణాపయోనిధీ
భావం: విస్తృతమైన జలతారు వస్తమ్రును గట్టి, వాడియైన గొడ్డలిచేత అడవిని నరుకునట్లుగా, జన్మబంధాలను, సంసార బంధాలను నాశము చేసి, సత్పురుషులను, మంచి నడవడి గలిగినవారిని పరిపాలించేవాడవు. దేవతల చేత పొగడబడిన మంచి గుణములు కలిగినవాడవు. అస్తమ్రుల విద్యచేత పరాక్రమ పద్ధతిని, నేర్పు కలవాడవు. శరత్కాలమందలి మేఘమువలెను, మల్లెపూవుల వలెను, మంచి గంధమువలెను, పచ్చకర్పూరము వలెను శ్రేష్ఠమైన తెల్లని స్వచ్ఛమైన కీర్తి కలిగినవాడవు. దయాసముద్రడవైన దశరథరామా.
వ్యా: విష్ణుమూర్తికి పీతాంబరుడు అనే పేరున్నది. పచ్చని బంగారు వస్తమ్రు ధరించిన వాడని అర్తం. శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారమే కాబట్టి బంగారు జలతారు వస్తమ్రును విస్తృతమైన దానిని రాముడు ధరించినాడని కవి ఇక్కడ వర్ణిస్తున్నాడు. రాజులు, రాణులు కేవలం శరీరానికి సరిపోయే వస్త్రం మాత్రమే ధరించరు. చాల నిడివియైన వస్త్రం వారి వెనుక జారుతూ ఉండడం రాజపద్ధతి. కనకవిశాలచేల, అనగా బంగారు వస్త్రం ధరించిన శ్రీరామా అని కవి సంబోధన.