నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాశరథి శతకం
*
చ.తరణికులేశ, నా నుడులఁ దప్పులు గల్గిన నీదునామస
ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె? వియన్నదీజలం
బరుగుచు వంకయైన మలినాకృతిఁ బారినఁ దన్మహత్త్వముం
దరమె గణింప నెవ్వరికి? దాశరథీ, కరుణాపయోనిధీ.
భావం: సూర్యవంశంలో జన్మించిన వారిలో శ్రేష్ఠుడవైన శ్రీరామా, నేను వ్రాసిన పద్యాల్లోని శబ్దాల్లో, మాటల్లో దోషాలున్నప్పటికీ, ఆ పద్యాలు, నీ నామముతోడ రచింపబడినవి కాబట్టి, ఈ కావ్యము పవిత్రమైనదే కదా. అట్లే అగునని భావం. మూడు లోకాల్లో ప్రవహించే గంగానది నీరు తన ప్రవాహంలో ఒకచోట వంకరగా తిరిగినప్పటికీ, బురద మొదలైన మాలిన్యంతో ప్రవహించినప్పటికీ, దాని గొప్పతనము ఎన్నుట సాధ్యమా - దాని మహత్త్వానికి భంగం కలుగదని భావం.

వ్యా: తరణి అంటే సూర్యుడు - ముందు వెళ్లేవాడు అని అర్థం. సూర్యుడు లోకానికి వెలుగును ప్రసాదించేవాడు. అంధకారాన్ని ఛేదించేవాడు. ఆ సూర్యుడు వంశకర్తగా ఉండిన వంశంలో శ్రీరాముడు జన్మించినాడు. ఈ వంశంలోనే దిలీపుడు, రఘువు, అజుడు, దశరథుడు మొదలైన చక్రవర్తులు జన్మించినారు. కాని, శ్రీరాముడు ‘తరణికులేశుడు’ ఈ సూర్యవంశంలో శ్రేష్ఠుడు అని అర్థం. ఈ శశబ్దానికి రాజు అని కూడ అర్థమే. సూర్యవంశంలో జన్మించిన మహారాజుల్లో శ్రీరాముడు సర్వశ్రేష్ఠుడు అని కవి భావించినాడు. అతడు సూర్యవంశజుడు కాబట్టి లోకానికి వెలుగును ప్రసాదించేవాడని కూడ అవి భావం.
తప్పులున్నా లేకపోయినా ‘నానుడులఁ దప్పులు గల్గిన’ అని కంచెర్ల గోపన్న పలుకడం ఆయన వినయ సంపదయే కానీ మరొకటి కాదు.
శ్రీరాముని పేరుతో వ్రాసిన కావ్యం పవిత్రమని కవి అనడంలో ఔచిత్యమే కాని, అతిశయోక్తి లేదు. దాశరథి శతకాన్ని గోపన్న కవి కేవలం శ్రీరామునికి అంకితం చేయడమే కాదు, ప్రతి పద్యం చివర ‘దాశరథీ కరుణాపయోనిధీ’ అనే మకుటం కూర్చి ప్రతి పద్యంలో తన ఇష్టదైవాన్ని సంబోధించి తృప్తి చెందినాడు.