నేర్చుకుందాం

నేర్చుకుందాం - దాశరథి శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ.దారుణపాతకాబ్దికి సదా బడబాగ్ని భవాకులార్తివి
స్తారదవానలార్చికి సుధారసవృష్టి దురంతదుర్మతా
చారభయంకరాటవికి చండకఠోరకుఠారధార నీ
తారకనామమెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ.
భావం: ఈ పద్యంలో కవి రామనామము మహత్త్వాన్ని వ్యక్తం చేస్తున్నాడు. సంసారాన్ని తరింపచేయునట్టి నీ నామము, బడబాగ్ని సముద్రాన్ని పీల్చినట్లుగా భయంకరమైన పాపాలను తొలగిస్తుంది. అమృతద్రవ వర్షము, అడవిలో ప్రజ్వలించే అగ్నిని చల్లార్చినట్లుగా సంసార బాధలను ఉపశమింపచేస్తుంది. పదునయిన గొడ్డలిధార, భయంకరమైన అడవిని నరికే విధంగా మితిమీరిన దుర్మతాచారాలను, దుష్టుల నడవడిని నిర్మూలనము చేస్తుంది. భద్రాచలంలో నివసించే ఓ దశరథరామా.
వ్యా: తారక శబ్దానికి దాటించేవాడు, తరింపచేసేవాడు అనే అర్థాలున్నాయి. శ్రీరాముడు భగవత్స్వరూపుడు. కాబట్టి సంసారము, జన్మ అనే వాటిని సుఖంగా దాటిస్తాడు. కాబట్టి ఆయన తారకరాముడైనాడు. శ్రీరాముని పేరు తారకనామమనుట కష్టాలతో కూడిన ఈ జన్మానికి మోక్షం ప్రసాదిస్తాడు. కాబట్టి అతడు తారకరాముడైనాడు. పడవవాడు, క్లిష్టమైన నదీ ప్రవాహాన్ని సుఖంగా దాటించిన విధంగా శ్రీరాముడు జన్మను సుఖమయం చేసి ముక్తిని కలిగిస్తాడు. అందుచేత జన్మ నదీప్రవాహం లాంటిదయితే, శ్రీరాముడు నావికుని వంటివాడు. ఇద్దరూ దాటించేవారే. ఇద్దరూ సుఖాన్ని కలిగించేవారే. రామదాసు అని ప్రఖ్యాతిని పొందిన కంచెర్ల గోపన్న కవికి శ్రీరాముని పేరు సదా తారకమంత్రమే.
రామనామ మంత్రాన్ని తాను తెలిసికొనడమే కాక, ఇతరులు కూడా తెలిసికొండని, ముక్తి చెందుతారని, రామదాసు ప్రబోధించినాడు. రామభక్తులకు రామనామము కంటె తారకమంత్రము లేదు.