నేర్చుకుందాం

నేర్చుకుందాం( దాశరథి శతకం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ.ఖరకరవంశజా, వినుమఖండితభూతపిశాచఢాకినీ
జ్వరపరితాపసర్పభయవారకమైన భవత్పదాబ్జవి
స్ఫురదురువజ్రపంజరముఁ జొచ్చితి నీయెడ దీనమానవో
ద్ధరబిరుదాంకమేమరకు దాశరథీ కరుణాపయోనిధీ

భావం: సూర్యవంశంలో పుట్టిన శ్రీదశరథ రామా, భూతాలు, పిశాచాలు, ఢాకినులు, తాపాలు, జ్వరాలు, వ్యాధులు, విష సర్పాలు మొదలగు వాటి వలన భయాలను పోగొట్టేవై వజ్రపంజరంలాగా రక్షించే నీ చరణాబ్జాలను శరణుజొచ్చినాను. నీవు దీనమాననోద్ధారకుడనే బిరుదు గలవాడవు. కాబట్టి నన్ను ఉద్ధరించక, నీ బిరుదాన్ని పోగొట్టుకొనకుమా!

వ్యా: కవి భక్తుడు కాబట్టి, తన దైవమైన శ్రీరామునితో ఆత్మనివేదనం చేసికొంటున్నాడీ పద్యంలో. నవ విధభక్తుల్లో ఆత్మనివేదనం ఒకటి కదా.
విశిష్టాద్వైత సంప్రదాయంలో సాధన, సాధ్య భక్తులకు, భక్తిప్రపత్తి అని పేరు. వీటిలో సాధన భక్తిని గూర్చి శ్రీమద్భాగవతం తెలియజేస్తుంది. కర్మజ్ఞానానుగ్రహీతమైన భక్తియే సాధన భక్తి. ఇదియే ఉపాయము. భగవంతుడు ఉపేయము.
భగవంతుని నిర్హేతుకజాయమాన కటాక్షముచే కలిగేది సాధ్యభక్తి. దీనికే ప్రపత్తి అనే పేరున్నది. దీనిలో ఉపాయోపేయములు భగవంతుడే. ఈ సాద్యభక్తికే శరణాగతి, న్యాసము, ఉపాయ స్వీకారము అనే పేర్లున్నాయి. ఈ ప్రపత్తి లేక శరణాగతి వలననే జాంబవంతుడు, హనుమంతుడు, గజేంద్రుడు మొదలైనవారు ‘పునరపి జననం పునరపి మరణమ్’ అనే దానికి అతీతంగా ఉండే పరమపదాన్ని పొందినారు. ఈ ప్రపత్తి మార్గానికి వయస్సు, జ్ఞానము, జాతి అనే వాటితో ప్రమేయం లేదు. యజ్ఞాదికర్మలచే చేసే సాధనకుండే దుర్లభమార్గం దీనికి లేదు. దురవస్థ లేదు. ఏ జీవియైనా దీని వలన పరమానంద స్థితి పొందవచ్చు.