నేర్చుకుందాం

నేర్చుకుందాం( దాశరథి శతకం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ.విన్నపమాలకించు రఘువీర, నహి ప్రతిలోకమందు నా
కన్న దురాత్ముఁడుం బరమకారుణికోత్తమ, వేల్పులందు నీ
కన్న మహాత్ముఁడుం బతితకల్మషదూరుఁడు లేఁడు నాకు వి
ద్వనున్నత నీవె నాకు గతి! దాశరథీ కరుణాపయోనిధీ

భావం: ఓ రఘువీరా, ఒక మనవి ఆలకింపుము. ఏ లోకంలోను, నాకంటె దుష్టుడు లేడు. దేవతలలో నీకంటె మహాత్ముడు లేడు. పాపాత్ములను ఉద్ధరించేవాడు, వారి పాపాలను నిర్మూలించేవాడు లేడు. అందుచేత దుష్టులలో శ్రేష్ఠుడనైన నాకు, దేవతలలో శ్రేష్ఠుడవైన నీవు దిక్కుగా నుండి, ఆధారంగా ఉండి ఉద్ధరింప శక్తుడవగుదువు గాని మరి ఒకరు కాజాలరు.

వ్యా: విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన మహానుభావుల్లో శ్రీయామునాచార్యులు ఒకరు. ఆయన తన ఆళువందారు స్తోత్రంలో-

అపరాధసహస్ర భాజనం పతితం భీమభవార్ణవోదరే
అగతిం శరణాగతం హరే కృపయా కేవలమాత్మసాత్కురు॥

అని భక్తుడు తన దోషాలను, తాను చేసిన అపరాధాలను క్షమింపుమని తనను ఉద్ధరింపుమని, భగవంతుని ప్రార్థించినాడు. గోపన్నకవి కూడ, ‘నాకన్న దురాత్ముఁడు లేఁడు’ అన్నప్పుడు పై శ్లోక భావమే స్ఫురిస్తుంది. ఇట్లా తనను తాను దోషములు చేసినవానిని అని చెప్పడాన్ని వైష్ణవులు నైచ్యానుసంధానం అంటారు. దాన్నిబట్టి వైష్ణవులందరు అపరాధాలు చేసినవారని కాదు. దాన్ని వైష్ణవోచిత స్వభావ సులభ వినయగుణ సంపన్నత్వంగా, స్వాహంకార పరిత్యాగంగా భావించవలసి ఉంటుంది. ఈ జన్మలో చేసిన భక్తుడెవడైనా తన తప్పులను గుర్తించుకుని ఉండవచ్చు. ఆ అపరాధాలు ఒక్కొక్క జన్మలో పరిహరింపబడడం వలన ఈ జన్మలో విష్ణ్భుక్తి సంక్రమించింది. ‘నరాణాం క్షీణపాపానాం విష్ణ్భౌక్తిః ప్రజాయతే’ అన్నట్లు, జీవునికి పాపాలు క్షీణదశకు వచ్చే సమయానికి విష్ణుమూర్తిపై భక్తి కలుగుతుందట.