నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాశరథి శతకం
*
ఉ. కలియుగమర్త్య కోటి నిను కన్గొన రాని విధంబో, భక్తవ
త్సలత వహింపవో, చటుల సాంద్ర విపద్దశవార్దిఁ గ్రుంకుచోఁ
మిలచిన పల్క వింత మరపే నరులిట్లనరాదు గాక, నీ
తలఁపున లేదె సీత చెర - దాశరథీ కరుణాపయోనిధీ
*
భావం: ఓ దశరథరామా! నేను మిక్కిలి ఆపత్సముద్రంలో మునుగుతూ, నిన్ను ఎంత పిలిచినా మారు పలుకవు ఇదేమి? కలియుగంలో మనుష్యులకు కనబడరాదని అనుకున్నావా? లేక, భక్తులపై నీకు వాత్సల్యం కలగడం లేదాః ఈ విధంగా నన్ను మరిచిపోవచ్చునా? నీకు మరుపు అని మాబోటులు చెప్పరాదు. కానీ, సీతాదేవికి కలిగిన చెరను మరువవు కదా! మేము కూడా అటులే చెరలో ఉన్నప్పుడు పిలిచిన పలుకని నీ మరుపు ఎక్కడిది?
*
వ్యాఖ్యానం: శ్రీరామభక్తుడైన కవి ఆత్మనివేదనం చేసుకొంటున్నాడు. భక్తుడు ఆపద అనే సముద్రంలో విలపిస్తూ ఉన్నాడు. తన ఇష్టదైవాన్ని శ్రీరాముని ఎలుగెత్తి పిలిచినవాడు. కాని అతడు రాలేదు సరికదా ప్రత్యుత్తరమిచ్చిన వాడుకాదు. దానికి సందేహం కలిగి, కలియుగంలో మనుష్యులకు దర్శనమీయకూడదనే నియమం చేసికొని నాకు కనబడలేదు. నా పిలుపునకు మారు పలుకలేదు అనుకోవచ్చునా అని శర్రాముని ప్రవర్తనను కొంత సమర్థించినాడు. రామునిపై ఉన్న భక్తి కారణం కొంత నిష్ఠురంగాను, కొంత ఆత్మీయంగాను కవి తన ఆవేదనను తెలియబరుస్తున్నాడు.