నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. నేనొనరించు పాపములనేకములైనను, నాదు జిహ్వకున్
బానకమయ్యె మీ పరమ పావన నామము దొంటి చిల్క ‘రా
మా, నను గావు’ మన్న తుదిమాటకు సద్గతిఁ జెందెఁ గావునన్
దాని ధరింపఁ గోరెదను దాశరథీ కరుణాపయోనిధీ!

భావం: ఓ దశరథరామా! పాపాలను అనేకం నేను చేస్తున్నవాడను. చేసినవాడను. ఇట్టి పాపాత్ముడనైనను నీ దివ్యనామం ఉచ్చరించడం నా నాలుకకు పానకం లాగా రుచికరంగా ఉంది. ఆ నామమెంతో నాకు ఆస్వాదయోగ్యంగా ఉంది. అదేవిధంగా అంటే పూర్వం ఒక చిలుక ‘రామా నన్ను కావుము’ అని కడపట ఒక్క మాట చెప్పగానే మోక్షం నొందెగదా. నీ పేరు అటువంటి స్థితి ప్రసాదిస్తుంది. కాబట్టి నేను చాలా రుచిగల నీ నామాన్ని పఠిస్తాను. (మోక్షాన్ని పొందుతాను)

వ్యాఖ్యానం: గోపన్న కవి ఎన్నో కష్టాలను అనుభవించాడు. కనుకనే పాపాలు చేయకుండా ఉండేంత సామర్థ్యం చాలామందికి ఉండదని గ్రహించాడు. కనుకనే పాపాలను ఇంతకుముందుకాలంలో చేసి ఉన్నాను. పైగా ఇపుడు చేస్తునే ఉన్నాను. కానీ నా మనసుకు నచ్చిన నామం శ్రీరామ అని కనుక నిరంతరం నీ నామాన్ని రుచికరమైన భోజనం లాగా అనుభవిస్తున్నాను. కనుక పూర్వకాలంలో జన్మ చివరిదశలో ఓ చిలుక రామా అని పిలిచినంతనే నీవు కాపాడావు కదా. అదే విధంగా నీ నామాన్ని ఎంతో ఆనందంతో పఠించే నన్ను కాపాడు. కాపాడడం నీకు అలవాటే కనుక నీ భక్తుడినైన నన్ను కాపాడుము అని కవి తన మనసులోని మాటను శ్రీరామునికి నివేదిస్తున్నాడు.