నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. సలలిత రామనామ జపసారమెరుంగను గకాశికాపురీ
నిలయుఁడఁగాను మీ చరణ నీరజరేణు మహాప్రభావముం
దెలియ నహల్య ఁగాను జగతీవర, నీదగు సత్య వాక్యముం
దలఁపఁగ రావణాసురుని తమ్ముడఁ గాను భవద్విలాసమున్
తలఁచి మతింప నాతరమె! దాశరథీ కరుణాపయోనిధీ

భావం: ఓ లోకపాలకా! ఓ దశరథరామా! నీ పేరును, అంటే రామనామాన్ని జపించడం చేత కలిగే శక్తి కాశీనగరంలో నివాసం చేసే విశ్వనాథుడనే ప్రఖ్యాతి కలిగిన మహేశ్వరునికి తెలుస్తుంది. కానీ, నాకు తెలియునా? నీ పాదధూళి యొక్క మహత్వము, మహిమ ప్రభావం అహల్యకు తెలుస్తుంది కానీ నాకు తెలియునాః నీ సత్యవాక్కులోని గొప్పదనాన్ని తెలుసుకోవడానికి రావణాసురుని తమ్మడైన విభీషణునికి శక్యము గానీ నాకు అసాధ్యమే కదా. నీ సుందరకృత్యాలు నావంటివానికి తెలిసికోవడం కానీ, వర్ణించడం కాని సాధ్యం కాదు.

వ్యాఖ్యానం: రాముని గొప్పదనాన్ని వర్ణిస్తూ తాను శక్తివంతుడను కాదని చెబుతున్నాడు. తానుకూడా శక్తిమంతుడు కావాలంటే శ్రీరాముని పాదథూళిని గురించి, ఆయన నామమహిమను గురించి తెలుసుకోవాలి. ఇంతకుముందు వారంతా నీతో పాటే ఉన్నారు కనుక నీ గురించి తెలిసింది. నేను కలికాలంలో ఉన్నాను. నీ గురించి తెలుసుకొనే సామర్ధ్యం లేదు. నీవే నన్ను కాపాడుము అని కవి ప్రార్థిస్తున్నాడు.