నేర్చుకుందాం

నేర్చుకుందాం -- దాశరథి శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. పాతకులైన మీ కృపకుఁ బాత్రులు గారె తలంచి చూడఁ
ట్రాతికి గల్గెఁ భావన మరాతికి రాజ్య సుఖంబు గల్గె, దు
ర్జాతికిఁబుణ్య మబ్బె ఁ గపిజాతి మహత్త్వము నొందెఁ గావునన్
దాతవ యెట్టి వారలకు దాశరథీ కరుణాపయోనిధీ!
భావం: దశరథ రామా! పాపాత్ములైనా, దోషాలు చేసిన వారైనా నీ దయకు పాత్రులైనవారు ఉన్నారు. గౌతముని శాపం చేత శిలగా ఉన్న అహల్యాదేవి నీ పాదస్పర్శచేత నిజరూపం పొందింది. శత్రువర్గంలోనివాడు, రాక్షసుడు అయిన విభీషణుడు నీ వలన లంకారాజ్యాన్ని పొందాడు. జటాయువు వంటి పక్షిజాతి కూడా నీ వలన పుణ్యం లభించింది. వనచరులైన సుగ్రీవాది వానరులకు నీ అనుగ్రహం చేత గొప్పతనం అబ్బింది. ఈ విశేషాలు చూడగా నీవు ఎక్కువ తక్కువలు పాటించేవాడవు కాదు అని తెలుస్తుంది. కోర్కెలను నెరవేర్చేదాతవు కూడా నీవే. స్వామీ నాకు నీవు తప్ప అన్యమేమీ తెలియదు. కనుక నన్ను నీవే కాపాడుము.
వ్యాఖ్యానం: భగవంతుడు నిర్వేహతుక జాయమాన కరుణా కటాక్ష విలసితుడు. తనను కోరిన వాడు. తన మీదభక్తి కలిగినవారు. ఏ జాతి వారు, ఏ తెగవారు అనే ఆలోచన ఆయనకుండదు. తనను నమ్ముకొన్న వారిని తనవారుగా భావించి వారిని కాపాడడం, వారిని తన కృపకు పాత్రుల చేయడమే నారాయణమూర్తి చేసే పని శ్రీమద్భాగవత భారత రామాయణాల్లో శ్రీమన్నారాయణుడుని నిర్హేతుకమైన కృపా వర్షానికి అనేక ఉదాహరణలున్నాయ.