నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాశరథి శతకం
*
ఉ. మామకపాతక వ్రజము మాన్ప నగణ్యము, చిత్ర గుప్తులే
మేమని వ్రాతురో శమనుఁడేమి విధించునొ? కాలకింకర
స్తోమ మొనర్చుటేమొ? వినిఁ జొప్పడదింతకు మునె్న దీనచిం
తామణి, యెట్లు గాచెదవొ? దాశరథీ కరుణాపయోనిధీ!
*
భావం: దశరథరామా! నేను అసంఖ్యాకమైన పాపాలు చేసినవాడిని. వాటిని నిర్మూలించుటకు లెక్క యెక్కడిది? ఈ పాపాలను యముని గణకుడైన చిత్ర గుప్తుడు ఏవిధంగా లెక్క పెట్టి వ్రాస్తాడో? అతడు వ్రాసిన పాపాల జాబితా చూసి వాటికి యముడేమి శిక్షలు విధిస్తాడో? మృత్యుసమయంలో కాలకింకరులు అంటే యమదూతలు ఏవిధంగా ప్రవర్తిస్తారో ఈ మృత్యువు ఆసన్నం కావడానికి పూర్వమే భయపడిన వారికి దిక్కు లేనివారికి కోర్కెలు తీర్చే చింతామణివి నీవు. ఓ రామా! నీవు ననె్నట్లు కాపాడుతావో?
*
వ్యాఖ్యానం: భారతీయుల్లో ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. భౌతిక విచారం తక్కువ. మానవునికి పాపపుణ్యాల భావం అనాదిగా వస్తూ ఉన్నది. మనుష్యుడు తనకు లభించిన జన్మలో పాపాలు చేయకూడదని, పెద్దల వలన మన ప్రాచీన గ్రంథాల వలన తెలిసి కొనడం పరంపరగా జరుగుతూ ఉన్నది. మన ధర్మశాస్త్రంలో ఐదు విధాలుగా పేర్కొన్నారు. సువర్ణస్తేయము, సురాపానము, బ్రహ్మహత్య, గురుపత్నీ గనమము మహాపాతకములు. వీటిని పంచమహాపాతకాలు అంటారు. మనుష్యుడు తన చంచల స్వభావం చేత ఈ పంచమహాపాతకాలకు గురైతే యమ లోకంలో ఉన్నచిత్రగుప్తుడు వీటిని లెక్కపెట్టి యమధర్మరాజు చేత దండన విధింపచేస్తాడని విశ్వాసం ఉంది. పుణ్యకార్యాలు చేస్తేనే సుఖం వుంటుంది కనుక పుణ్యకార్యాలను నా చేత చేయించుము అని ప్రార్థిస్తున్నాడు.