నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. వలదు పరాకు భక్తజన వత్సల , నీ చరితమ్ము వమ్ము గా
వలదు పరాకు, నీ బిరుదు వజ్రమువంటిది కావకూరకే
వలదు పరాకు, నాదురితవార్ధికిఁ దెప్పవుగా మనంబులో
దలఁతుమే కా నిరంతరము దాశరథీ కరుణాపయోనిధీ!

భావం: భక్తులపై దయ, ప్రేమ కలవాడా, దశరథరామా! శరణు వేడినవారిని ఆశ్రయించిన వారిని రక్షింతువని తెలిపే నీ నడవడి, నీ చరితము నిష్ఫలం కాకూడదు. నీ సామర్థ్యచిహ్నమైన బిరుదము సుస్థిరమైంది. కఠినాతికఠినమైన రత్నం లాంటిది. వజ్రాయుధం వంటిది. నీవురక్షించకపోవడం వల్ల అది నిష్ఫలం కాకూడదు. నీకు హెచ్చరిక- దానిపై తత్పరుడవగుము. జాగ్రత్త సుమీ. నిన్ను నేను సదా స్మరింతును.నేను చేసిన అపారమైన సముద్రం లాంటి పాపాలను దాటడానికి నీవు ఓడ వంటివాడవని తలుచుకుం ఉంటాను.
నేను చాలానే పాపాలను చేసినాను. వాటిని లెక్కపెట్టడానికి వీలులేనన్ని అపారంగా ఉన్నాయి. అవి ఒక సముద్రంలాగా కనిపిస్తున్నాయి. వాటిని దాటడానికి నీ నామమే నాకు తెప్పవలె ఉపయోగపడుతుంది. ఒకవేళ నీవు కాపాడకపోతే భక్తవత్సలుడనే నీ నడవడి వ్యర్థం కావచ్చు. ఆశ్రీతులను కాపాడేవాడవనే నీ బిరుదు సార్థక్యం కోల్పోవచ్చు. అట్లా అవకూడదు సుమీ. నీవు భక్తజనులను కాపాడానికి వేగిర పడు.

వ్యాఖ్యానం: ఈ పద్యంలో భక్తుడు తన దీనావస్థను చెబుతూనే రామునికి గల బిరుదులను, ఆయన శ్రేష్ఠత్వాన్ని ఎత్తి చూపుతూ ఒకవేళ నీవు నీ భక్తులను కాపాడడంలో జాప్యం చేస్తే నీకున్న బిరుదులు, నీ శ్రేష్ఠత్వానికి మచ్చకలుగుతుందేమో అని అంటున్నాడు. చేసిన దోషాలను స్మరిస్తూ చాలా తప్పులను చేశానని పశ్చాత్తాపం చెందుతూ వాటిని దాటి నేను నీ దగ్గరకు రావాలంటే రామనామమే నాకు తెడ్డుగా ఉపయోగపడుతుందని కూడా చెబుతున్నాడు.