నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాశరథి శతకం
*
చ. ఇతఁడు దురాత్ముఁడంచు జనులెన్నఁగ నాఱటి గొంటి, నేనె పో
పతితుఁడనంటిపో, పతితపావన మూర్తివి నీవు గల్గనే
నితరుల వేడనంటి నిహమిచ్చిన నిమ్ము, పరంబొసంగుమీ
యతులితరామనామ మధురాక్షర పాళి నిరంతరంబు హృ
ద్గతమని నమ్మి కొల్చెదను దాశరథీ కరుణాపయోనిధీ!
*
భావం: దశరథరామా! నేను దుష్టమనస్సు గలవాడనని జనుల చేత నిందింపబడితిని. నేను పతితితుడనని నా అంతట నేనే నీతో చెప్పికొంటిని. పతితులను, పవిత్రులుగా జేయనవతరించిన నీవుండగా పతితుడనైన నేను నినే్న వేడుదును గాని మరియొకని వేడనని చెప్పితిని. ఇక నీవే ఒకడవు నాకు స్వామివి,. నీవే ఇహమిచ్చినను ఈయవలెను. వరమిచ్చినను ఈయవలెను. నేను మాత్రము రామ అనే తీయని అక్షరాలను మనస్సులో నిలుపుకొని కొలుపు చేస్తాను.
*
వ్యాఖ్యానం: రామదాసుగారు జనుల చేత ‘ఆరడి’ గొన్నారట. అంటే నిదను పొందినారు. బహుశా ప్రజల ధనాన్ని లేక రాజధనాన్ని దుర్వినియోగం చేసి భద్రాచలంలో శ్రీరామ మందిరాన్ని కట్టించినాడనే నింద కావచ్చు. కాని ఇది నిజం కాదుకదా. అందరూ ఇహలోకంలో సంపదలు కూడకట్టుకుంటూ ఉంటే అందరికోసం పరలోకంలో సంపదలనిచ్చేవాడు ఇక్కడ ఉన్నాడు అందరూ రండి వచ్చి ఈ రాముని వేడండి. వీడు పరసంపదలనిస్తాడని రామదాసునే గదా చెప్పింది. కనుక రామదాసు చేసింది తప్పో ఒప్పో రాముని శరణు వేడితే తప్పొప్పులను శ్రీరాముడే లెక్కవేసుకొంటాడు. ముందు అయితే తనను శరణు వేడిన వారికి కాపాడుతాడు. కనుక నేను చేసిన తప్పులు చాలానే ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం నేనునీపాదాలను పట్టుకొన్నాను. నాకు నీవు తప్ప అన్యం తెలీదు కనుక నీవే నన్ను కాపాడుము అని భక్తుడు భగవంతుడని వేడుకుంటున్నాడు. ఇది సహజమైన పరిణామమే.