నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. అంచితమైన నీదు కరుణామృత సారము నాదుపైని బ్రో
క్షించిన చాలు, దాన నిరసించెద నాదురితంబులెల్లఁ దూ
లించెద వైరివర్గమెలించెదఁ గోర్కుల నీదు బంటవై
దంచెదఁ గాల కింకరుల దాశరథీ కరుణాపయోనిధీ!

భావం: ఓ దశరథ రామా! ఒప్పిదమైన నీదయామృత సారాన్ని నామీద చల్లితే చాలు నీ అమృతం వంటి దయను నామీద ప్రసరింపచేస్తే చాలు. దాని చేత నా పాపాలను దూలించి అంతశ్శత్రువులైన ఇంద్రియాలను చిక్కబట్టి రాగద్వేషాలను వదిలి, నీ దాసుడనై యమకింకరులు వచ్చిరేని వారిని తరిమికొట్టెదను.

వ్యాఖ్యానం: భక్తుడు ఈ పద్యంలో శ్రీరాముని దయను తనపై ప్రసరింపచ ఏయమని ప్రార్థిస్తున్నాడు. భక్తుడు ఎంత వేడికొన్నను ఈశ్వరుని దయ కలుగకపోతే ఫలితం లేదుకదా. దయాగుణాన్ని శ్రీరాముడు సమృద్ధిగా కలిగినట్టివాడు.
కవి అతనిని ప్రతిపద్యంలోను కరుణాపయోనిధీ అని సంబోధిస్తున్నాడు. దయాగుణానికి సముద్రం వంటివాడు రాముడని భక్తుని నమ్మకం. రాముని దయ మరణం నుండి విముక్తి కలిగిసుతంది. మృత్యుభయం లేకుండా కాపాడుతుంది. అమృతసారాన్ని ప్రసరింపచేస్తుంది. తాను చేసిన పాపాలను రామనామంతో కడిగివేస్తాను నీవు నాపై కరుణ చూపుము అని కవి రాముని ప్రార్థిస్తున్నాడు.