నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. కోతికి శక్యమా యసురకోటుల గెల్వను?గెల్చె ఁబో నిజం
బాత నిమేన శీతరుఁడౌట దవానలుఁడెట్టి వింత? మా
సీత పతివ్రతా మహిబ సేవకు భాగ్యము మీ కటాక్షమున్
ధాతకు శక్యమా పొగడ? దాశరథీ కరుణాపయోనిధీ!

భావం: దశరథ రామా! ఒక వానరుడు హనుమంతుడు అసంఖ్యాకమైన రాక్షసులను జయించడం సాధ్యమా? శక్యముకాదు. కాని జయించినాడు. అది యెట్లు శక్యమైనను కానిమ్ము, కానీ, అతని వాలములో అంటించిన అగ్ని, వేడిని చూపక కాల్చివేయక చంద్రుని వలె చల్లదనం కలిగించడం మరింత ఆశ్చర్యం కదా. ఇంతకు సీతాదేవి పాతివ్రత్య మహిమ వలన ఆమె మిమ్ములను సేవించడం వలన హనుమంతుడు మీకు దాసుడగుట వలన నీ దయాస్వభావం చేత ఇది జరిగింది. సీతాదేవి పాతివ్రత్యాన్ని ఆమె హనుమంతుడు మీకు చేసిన సేవను, మీ దయాగుణాన్ని పొగడి వర్ణించటం బ్రహ్మకైనను శక్యం కాదు.

వ్యాఖ్యానం: కవి శ్రీరాముని దూతగా లంకానగారానికి వెళ్లి సీతాదేవిని హనుమంతుడు దర్శించడం అక్కడ రాక్షసులతో పోరాడడం జరిగింది. అయితే ఒక కోతిని నీ దయవలనే నూరు యోజనాలు కల సముద్రాన్ని దాటగలిగింది. రాక్షసులతో పోరాడ గలిగింది. అంతేకానీ కోతికున్న శక్తి సామర్థ్యాలతో మాత్రం కాదు. ఇది కేవలం నీ దయవలనే జరిగింది. పైగారాక్షసులు కోతి తోకకు నిప్పు అంటించారు. వేడిని కలిగించాల్సిన ఆ నిప్పు చల్లదనాన్ని ఇచ్చింది అంటే అదంతా సీతాదేవి పాతివ్రత్యమహిమ వల్లనే జరిగింది అని కవి అభిప్రాయ పడుతున్నాడు.