నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. నీ సహజంబు సాత్త్వికము, నీవిడిపట్టు సుధాపయోధి, స
ద్మాసనుఁ డాత్మజుండు గమలాలయ నీ ప్రియురాలు, నీకు సిం
హాసనమిద్ధరిత్రి, గొడుగుగాకస, మక్షులు చంద్రభాస్కరుల్
నీ సుమతల్పమాదిఫణి నీవె సమస్తము గొల్చునట్టి నీ
దాసుల భాగ్యమెట్టిదయ దాశరథీ కరుణాపయోనిధీ!

భావం దశరథ రామా! సత్త్వగుణము నీ స్వభావము, నీ నివాస స్థానము పాల సముద్రము, నీకొడుకు బ్రహ్మదేవుడు, నీ భార్య లక్ష్మీదేవి, ఈ భూమి నీ సింహాసనము. ఆకాశము నీగొడుగు, నీ కన్నులు సూర్యచంద్రులు, ఆదిశేషుడు నీ పూలపాన్పు. ఇవి అన్నియునీ రూపములే. నీవుకానిది లేదు. ఇట్టి నిన్ను గొల్చిన భక్తుల భాగ్యము సంపద ఎటువంటిదో చెప్పతరమా? చెప్పతరము కాదు.

వ్యాఖ్యానం: సర్వత్రా వ్యాపించిన వాడు, అన్ని ప్రాణుల్లో అంతర్యామిగా ఉన్నవాఢు అయన పరమాత్మ కానిది ఏ జగత్తులో ఏమీ లేదు. సర్వమూ జగన్నాథుడే. చెట్టు చేమ, పుట్ట తట్టా, గొడ్డుగోదా కొండ ఏదైనా ఈశ్వరుడే. ఈశ్వరుడు గానిది ఏదీ లేదు. కనుక మనం చూసే కనులతో చూస్తే పరమాత్మ కనిపిస్తాడు. చూసేదానికి మనం పెట్టుకున్న పేరుతో పిలిస్తే ఆ పేరు తలవగానే వారే కనిపిస్తారు.
అట్లాకాక అందరినీ అన్నింటినీ సహస్రనామాలతో విరాజిల్లే ఆ పరాత్పరుని పేరును పెట్టుకుంటే ఆ నామధారినే కనిపిస్తాడు. అంతా మన భావనలో ఉంది. భావనామయం జగత్తు, జగన్నాథుడు.