నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. చరణము సోకినట్టి శిల జవ్వని రూప గుటొక్క వింత, సు
స్థిరముగ నీటిపై గిరులు దేలిన ద్కొటి వింత గొని,మీ
స్మరణఁ దనర్చు మానవులు సద్గతిఁ జెందినదెంత వింత? రుూ
ధను ధరాత్మజారమణ! దాశరథీ కరుణాపయోనిధీ

భావం: దశరథ రామా! నీ పాదములను తాకిన శిలను వనితగా చేయడమును, కొండలను, రాళ్లను సముద్రం నీటి మీద మునుగుకుండునట్లు నిల్పడమును అద్భుతము కాని నిన్ను ధ్యానించి స్మరించిన వారికి మోక్షం ఇవ్వడం ఏమి వింత? అంటే అది రాముని తలుచుకున్నంతనే మోక్షం దానికదే వచ్చేస్తుంది.

వ్యాఖ్యానం: రాముని బాటలో నడవడం, రాముని అనుసరించడం అనుకరించడం చేస్తేనే ధర్మమార్గంలో నడవడం కదా. అందుకే రాముడు అవలీలగా చేసిన పనులను తలుచుకుంటూ అవి చేసాడు కనుక మనకు మోక్షం ఇస్తాడు అని తలవకుండా మనమూ రాముని మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు అడుగులు వేస్తూ పోతే తప్పకుండా రాముని అనుగ్రహం వస్తుంది. దాని వెంబడే మోక్షమూ వస్తుంది.
అది నిజమే కానీ మోక్షం ఒక్కదాని కోసం కేవలం రామనామం జపించకుండా రాముని అనుసరిస్తూ రాముడు ఆచరించిన ధర్మమార్గంలో మనమూ నడిచి సమాజానికి చేతనైనంత సాయం చేస్తూ రాముని ధర్మమార్గాన్ని మనమూ ఆచరించడమే కాక అందరిచేత ఆచరింపచేస్తే మోక్షం దానంతట అదే వచ్చేస్తుంది కదా.