నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. పదయుగళంబు భూగగన భాగములన్ వెసమాని విక్రమా
స్పదుఁడగు సబ్బలీంద్రు నొక పాదమునం దలక్రింద నొత్తి మే
లొదవ జగత్త్రయంబుఁ బురుహూతునకియ్య వటుండవైన చి
త్సదమల మూర్తి నీవె కదా! దాశరథీ కరుణాపయోనిధీ!

భావం: ఓ దశరథ రామా! ఒక పాదము భూమి మీదను, మరొక పాదము ఆకాశంలోను పెట్టి రెండు పాదాలచే లోకాన్ని ఆక్రమించి మహాపరాక్రమ శాలియైన బలి చక్రవర్తి తల మీద ఒక పాదాన్ని మోపి పాతాళానికి అణగదొక్కి మేలు కలిగే విధంగా మూడు లోకాలను ఇంద్రునకు ఇచ్చుటకు వటువుగా మారిన సచ్చిదానంద మూర్తివి నీవే కాని మరెవ్వరు కారు.

వ్యాఖ్యానం: శ్రీ మహావిష్ణువు వామనావతారం వహించి లోకాలకు శ్రేయస్సు కలిగించి ఆక్రమంగా ప్రవర్తించిన బలి చక్రవర్తి అహంకారాన్ని అణిచివేసి విశ్వరూపాన్ని ప్రదర్శించి సాధువులను రక్షించడానికి ఏ అవతారాన్నైనా నేను దాలుస్తాను అని మరొక్కసారి చెప్పిన నీవే వామనమూర్తివిగా వచ్చినావని నేను తెలుసుకొన్నాను. ఈ పని చేయడానికి నీవు మాత్రమే సమర్థుడివి. భక్తుల రక్షణార్థం భగవంతుడు ఏ అవతారాన్నైనా సునాయాసంగా ధరిస్తాడు కనుక భక్తుడు తనకిష్టమొచ్చినట్టుగా భగవంతుడిరూపాన్ని భావించుకొని పూజి స్తాడు.