నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ ఇరువది యొక్కమారు ధరణీశుల నెల్ల వధించి తత్కళే
బరరుధిర ప్రవాహమున ఁ బైతృకతర్పణ మొప్పఁ జేసి , భూ
సురవర కోటికిన్ ముదము సొప్పడ భార్గవ రామ మూర్తివై
ధరణినొసంగితీవె కద దాశరథీ కరుణాపయోనిధీ!

భావం: దశరథ రామా!క్షత్రియులై భూమిని పరిపాలిస్తున్న అనేకమంది రాజులను ఇరువది యొక్క పర్యాయాలు సంహరించి, వారి శరీరాల్లో ప్రవహించే నెత్తురును తీసుకొని దానితో నీ పితరులకు జలతర్పణం చేసి వారి నుండి జయించిన భూమిని బ్రాహ్మణ సమూహానికి సంతోషం కలిగేటట్లుగా కశ్యపునికి దానం చేసినావు. అపుడు నిన్ను భార్గవ రాముడని కీర్తించారు. నీవే పరశురామునిగా అవతరించినావు.

వ్యాఖ్యానం: లోకంలో తామసం పెరిగినప్పుడు అహంకారం అధికమైనప్పుడు గోబ్రాహ్మణులకు హింస తలపెట్టినప్పుడు శ్రీమన్నారాయణుడు అవతరించి దుష్టులను దునుమాడి సజ్జనులనుకాపాడుతాడు. అట్లానే రాజులు అహంకార పూరితులై వ్యవహరిస్తున్నపుడు విష్ణ్భుగవానుడు పరశురామునిగా పుట్టి అహంకార మదోన్మత్తులైన రాజులను తెగటార్చినాడు. వారి రుధిరంతో తన పితరులకు తర్పణాలు విడిచినాడు. తిరిగి వారి దగ్గర నుంచి జయించిన భూమిపై ఆశ పెంచుకొనగ కశ్యపునికి దానం చేసినాడు. ఇదంతా కేవలం విష్ణుమూర్తి కనుక చేసినాడు. మరెవ్వరికీ ఇలాంటి పనులు సాధ్యంకావు. పరమేశ్వరా సృష్టిస్థితిలయలు నీకే సాధ్యం. నీవే నన్ను సదా కాపాడుము.