నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. సురలు నుతింపగాఁ ద్రిపురసుందరరులన్ వరియింప బుద్‌ధ రూ
పరయఁగఁ దాల్చితీవు, త్రిపురాసుర కోటిదహించునప్పుడా
హరునకుఁ దోడుగా వరశరాసన బాణముఖోగ్రసాధనో
త్కర మొనరించితీవె కద దాశరథీ కరుణాపయోనిధీ!

భావం: దేవతలు ప్రార్థించగా త్రిపురములందలి వనితలను వరించుకొరకు బుద్ధ స్వరూపమును దాల్చిన వాడవు నీవే. రాక్షస సమూహాలను కాల్చునపుడు శివునకు విల్లు, అమ్ములు మొదలైన సాధనములను సవరించి సాహాయ్యము చేసినవాడవు నీవే. ఇట్లు దుష్టులను నిగ్రహించి శిష్టులను రక్షించు నీవు నన్నును రక్షింపుము

వ్యాఖ్యానం: బుద్ధావతారాన్ని గురించి చారిత్రక విశేషాలకునూ, పౌరాణికా విషయాలకునూ భేదం కనిపిస్తుంది. చరిత్రలోని బుద్ధుడు, మాయాదేవి శుద్దోతన మహారాజుల కుమారుడు. పురాణాల్లో బుద్ధుని తొమ్మిదవ అవతారంగా విష్ణుమూర్తి స్వరూపంగా వర్ణించడమైంది. అతని తండ్రి పేరు అజినుడు. రాక్షసులు క్రమంగా శక్తిని సంపాదించినారు. స్వర్గంలో అధికారాన్ని హస్తగతం చేసికొన్నారు. వారు యజ్ఞ పరాయణులై పరిపాలన సుస్థిరం చేసికొన్నారు. అజేయులైనారు. మదమత్తులైనారు. దేశంలో ఉపద్రవాలను కలిగించి అశాంతిని, అసురభావాన్ని ప్రబల చేసినారు.
అప్పుడు భగవానుడు బుద్ధుడుగా అవతరించి దైత్యుల యజ్ఞానుష్ఠానాదులను చూసి వారితో మీరు యజ్ఞాల పేరుతో జీవ హింస చేస్తున్నారు. జంతుమాసంతో అగ్నిని అపవిత్రం చేస్తున్నారు. అని తాను జీవహింస చేయకుండా ప్రవర్తించినాడు. అపరిశుద్దంగా చేసిన దైవకార్యాలు వల్ల రాక్షసులు స్వర్గభ్రష్టులైనారు. త్రిపురములలో ఉండే స్ర్తిలు కూడా బుద్ధుని వరించి చరితార్థులైనారు.