నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాశరథి శతకం
*
చ. దురమునఁ దాటకంచు నిమి ధూర్జటివిల్ దునుమాడ సీతనుం
బరిణయమంది తండ్రి పనుపన్ ఘన కానన భూమి కేగి, దు
స్తర పటు చండకాండకు లిశాహతి రాశణ కుంభకర్ణ భూ
ధరముల ఁ గూల్చి తీవె కద దాశరథీ కరుణాపయోనిధీ!
*
భావం: దశరథ రామా యుద్ధంలో తాటకను సంహరించావు. శివుని విల్లు విరిచి సీతాదేవిని పరిణయమాడినావు. తండ్రియైన దశరథుడు చెప్పినట్లుగానే భయంకరమైన దండకారణ్యానికి వెళ్లినావు. వజ్రాయుధంతో కొండలను కూర్చినట్లు కఠినమైన వాడి యైన బాణాల చేత రావణ కుంభకర్ణాదులను కూల్చినవాడవు నీవేకదా.
వ్యాఖ్యానం: కవి అన్ని పద్యాలల్లో పూర్వ దశావతార కథలను సంక్షిప్తంగా వర్ణిస్తూ వచ్చారు. ఈ పద్యంలో రామావతారంలోని ప్రధాన ఘట్టాలను స్మరిస్తున్నాడు. విశ్వామిత్రుని యాగ సంరక్షణార్థం వెళ్లి గురువు చెప్పినట్లు గా వింటూ దారిమధ్యలో తమమీదకు రాబోయే తాటకను సునాయాసంగా సంహరించివేశాడు రాముడు. ఆ రాముడే మునివర్యునితోమిథలకు వెళ్లి అక్కడ జనకుడు పెట్టిన షరత్తు ప్రకారం గురువాజ్ఞతోనే శివుని విల్లును విరిచినాడు. ఆ తరువాత సీతమ్మను పెండ్లాడాడు.
తిరిగి అయోధ్యకు వచ్చాడు. పట్ట్భాషేకం చేసుకోవాల్సిన రాముడిని దశరథుడు పిలిచి వనవాసానికి వెళ్లుమని చెప్పితే అంతే సంతోషంతో భయంకరమైన అడవులకు నార వస్త్రాలు ధరించి వెళ్లినాడు. అక్కడ తాపస పురుషుడువలె సంచరించినాడు. అపుడు కూడా ఎందరో రాక్షసులతో పోరాడి వారిని తుదముట్టించినాడు.