నేర్చుకుందాం

నేర్చుకుందాం -- దాశరథి శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. హరిపదభక్తి నింద్రియజయాన్వితుఁడుత్తముఁ డింద్రియమ్ములన్
మరుగక నిల్పనూదినను మధ్యముఁ డింద్రియ పారవశ్యుఁడై
పరగినచో నికృష్ణుఁడని పల్కఁగ, దుర్మతి నైన నన్ను నా
దరమున నెట్లు కాచెదవొ? దాశరథీ కరుణాపయోనిధీ!
భావం: దశరథ రామా! విష్ణ్భుక్తితో ఇంద్రియాలను, కోరికలను, ఆశలను గెలిచినవాడు ఉత్తముడు. ఇంద్రియాలకు లోనుగాక నిలచి ప్రయత్నించి నిగ్రహించువాడు మధ్యముడు. ఇంద్రియాలకు ఆధీనమైన వాడు అధముడు. ఈ మువ్వురిలో దుష్టబుద్ధినైన నేను అధముడను. అట్టి నన్ను ఆదరంతో నీవే ఏ విధంగా రక్షిస్తావో?
వ్యాఖ్యానం: మానవుడు లోకంలో ఆశలకు అవయవ బలహీనతలకు లోను గావడం సహజం. అట్లా జరిగినప్పుడు తనకును తోడి మానవులకు ను హాని కలుగక పోదు. అందుచేత ఏకాదశేంద్రియాలను జయించడమే మానవుడు పరమార్థంగా భావించాలి. దానికి హరిపదభక్తి మంచి సాధనం. ఈ సాధనం వల్ల మనస్సును బంధించి కోరికలను జయించి భక్తిమార్గాన్ని అవలంబించిన పూర్వం ప్రహ్లాద నారదాది విష్ణ్భుక్తులు తరించినారు. ఈ విష్ణు భక్తులు ఇంద్రియాలను జయించినవారిలో ఉత్తమోత్తములు. మొదటి తరగతికి చెందినవారు. ఆశలను, కోరికలను చూసి వాటికి వశం కాక వాటిని బంధించి ప్రవర్తించిన వాడు మధ్యముడు. ఇంక మానవ సహజంగా ఆశలకు, కోరికలకు లోనైన వాడు అధముడు. మూడవ తరగతిచెందినవాడు. కవి తనను తాను ఈ తరగతిలో చేర్చుకుని తనను కాపాడుమని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని కవి ఈ పద్యంలో చెబుతున్నాడు. మనమూ ఏ తరగతికి చెందినవారిమో మనకు మనమే పరీక్షించుకుని దైవాన్ని శరణు వేడితే మనకు రక్ష దొరుకుతుంది అని పద్య అంతరార్థం.