నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చ. వనకరి చిక్కె మైనసకు , వాచనికిం జెడిప ఓయె మీను, తా
వినికికిఁ జిక్కెఁ జిల్వ కనువేదరుఁ జెందెను లేళ్లు , తావిలో
మనికి నశించెఁదేటి తరమా యిరుమూటిని గెల్వ నైదుపా
దనముల నీవె కావఁదగు దాశరథీ కరుణాపయోనిధీ!

భావం: దశరథ రామా అడవిలో స్వేచ్ఛగా తిరిగే ఏనుగు, ఆడు ఏనుగును చూసి వ్యామోహం పొంది బందీ అవుతాయి. చేప గాలములోని ఎర కు రుచి మరిగి దానికి వశమవుతుంది. సర్పము పాముల వాడు ఊదెడు స్వరమును విని పరవశించి చిక్కి పోతుంది. హరిణము, కనుపిచ్చి చేత నశించిపోవును. తుమ్మెద పరిమళమునకు ఆకర్షితమై తామర పుష్పాల్లో చిక్కిపోవును. ఈ ఐదు ఇంద్రియాలను గెలుచుట ఎవరికి సాధ్యం? నేను ఇంద్రియ లోలుడను కాబట్టి మోక్షమును పొందుట కష్టం. కనుక పంచేంద్రియమ్ముల నిన్ను గొల్చు పంచవిధ కైంకర్యముల చేత ఇంద్రియాలను నడచి నన్ను కాపాడుము.

వ్యాఖ్యానం: త్వక్కు, చక్షువు, రసన, శ్రోత్రము, ఘ్రాణము అనే జ్ఞానేంద్రియ శక్తులు సహజంగా ఇతర జీవుల వలనే మానవునికి కూడా సంక్రమించాయి. జంతువులు ఆ శక్తులకు లోనై ఏ విధంగా పతనమవుతున్నాయో మనుష్యుడు కూడా అట్లానే ఇంద్రియ శక్తులకు లోనై ప్రమాదానికి లోను అవుతాడు. ఈ ఇంద్రియాలను జయించడం అంత సులభం కాదు. కనుక మేము నినే్న నమ్ముకుని ఉంటిమి. నీవే మమ్ములను కాపాడుము.