నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉ. భానుఁడు తూర్పునందుఁ గనుపట్టిన ఁ బావకచంద్ర తేజముల్
హీనతఁజెందినట్లు జగదేక విరాజితమైన నీ పద
ధ్యానము సేయుచున్నఁ బరదైవ మరీ చులడంగ కుండునే
దానవ గర్వ నిర్దళన దాశరథీ కరుణాపయోనిధీ!

భావం: సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించినప్పుడు, అతని కాంతి లోకంలో వ్యాపిస్తుంది. ఆ కాంతి కారణంగా అగ్ని, చంద్రుడు మొదలైన వారి వెలుగులు వెలవెలా పోతాయి. అదేవిధంగా లోకంలో అంతటా వ్యాపించిన ఉన్న నీ భక్తిని నీ ధ్యానమును, నీ భక్తులు చేసినపుడు ఇతర దైవతముల కాంతులు వారి మహత్త్వాలు అణిగిపోతాయి కదా. ఇది యథార్థము. రాక్షసుల మదాన్ని అణచివేసే ఓ శ్రీరామా!

వ్యాఖ్యానం: ఈ పద్యంలో శ్రీరాముడు విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడ,, సర్వత్కృష్టుడని ఇతర దైవతములు ఆయన ముందు తృణప్రాయములని కవి బోధిస్తున్నాడు. సూర్యుని వెలుగుముందు అగ్ని , చంద్రుడు ప్రసరించే వెలుగులు వెలవెలబోకుండునా అని కూడా సూర్యుని వెలుగుతో వీరి వెలుగును పోల్చి చెప్పినాడు. నారాయణుని జగదేక విరాజితుడైన వానిని ధ్యానం చేసేవారు, ఇతర దైవతములను లెక్క చేయనవసరం లేదని అతడే ఉన్నతోన్నతుడని కవి చెబుతున్నాడు. సర్వానికి కారణమైన సర్వేశ్వరుడే అన్నీయును కదా. అట్లాంటపుడు అందరిలోను అన్నింటిలో అంతర్యామిగా ఉన్న పరమేశ్వరుని ముందుగాని, వెనుక గాని ఉండేవారు కూడా నారాయణులే. అంతటా నారాయణుడే